విద్యార్థినిపై స్కూల్ డైరెక్టర్ రేప్

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. సత్ప్రర్తన, మంచి విద్యాబుద్ధులతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన ఓ స్కూల్ డైరెక్టరే కామాంధుడిగా మారాడు. దాదాపు 20 మందికి పైగా అమ్మాయిలను వేధించాడు. అంతేగాక, ఓ విద్యార్థినిపై లైంగికదాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలోని ఈటాలో ఓ పాఠశాల డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు నిందితుడు జితేందర్ సింగ్ యాదవ్. కాగా, పాఠశాలలోని పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు.

rape-3 years

అంతేగాక, ఓ 15ఏళ్ల బాలికను తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. ఆమె బతిమాలినా వినకుండా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని ఆ కామాంధుడు.. విద్యార్థినితో గడిపిన వీడియోను వాట్సప్‌లో పోస్ట్ చేశాడు. కాగా, దాదాపు సంవత్సరం నుంచి తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పినట్లు చేయకపోతే వీడియోను నెట్‌లో పెడతానని బెదిరించేవాడని ఆమె తెలిపింది. అతని ఉచ్చులో చిక్కుకుని 20 మందికి పైగా బాలికలు నరకం అనుభవిస్తున్నారని ఆ బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు బగ్వాలా ప్రాంతంలోని శ్రీ కృష్ణా సెకండరీ స్కూల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *