పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటును ఏపీ కోటాలో ఇవ్వాలని తాము కోరలేదని చెప్పారు. ఆయనకు సీటు ఇవ్వాలని తాము కోరామా? లేక తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసిందా అనే విషయం టీడీపీనే అడిగి తెలుసుకోవాలని చెప్పారు.

bjp-dharna-at-collectorate-601

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కోరితే తాము సురేష్ ప్రభుకు సీటు ఇచ్చామని టిడిపి నేతలు చెప్పడం సరికాదన్నారు. మంగళవారం నాడు టిడిపి యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ… ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా కోరితే తాము సీటు ఇచ్చామని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బుధవారం నాడు పురంధేశ్వరి ఖండించారు. అయితే, లోకేష్ పేరు చెప్పలేదు.

అమిత్ షా కోరితే సురేష్ ప్రభుకు రాజ్యసభకు అవకాశం కల్పించామని టిడిపి నేతలు చెప్పడాన్ని ఆమె ఖండించారు. ఏది ఏమైనా రైల్వే మంత్రి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల అదృష్టమని చెప్పారు. ఈ నెల 4న రాష్ట్రంలో కేంద్రమంత్రులు పర్యటిస్తారని చెప్పారు.

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *