దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార లవ్ ఎఫైరే

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో శింబుతో నయనతార లవ్వాయణం, ఇద్దరి చాటు మాటు రొమాన్స్ ఫోటోస్ లీక్ అవ్వడం అప్పట్లో ఓ సెన్సేషన్. శింబుతో విడిపోయిన తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు.

nayanthara

ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార. తర్వాత ‘నానుం రౌడీ దాన్‌’ చిత్రంలో నటించిన నయనతార ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిందని, ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. పెళ్లి విషయం ఖండించినా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవల నయనతార, విఘ్నేష్ శివన్ విడిపోయినట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే అలాంటి దేమీ లేదని ఇటీవల సైమా అవార్డుల వేడుకలో తేలిపోయింది. ఇద్దరి మద్య రిలేషన్ షిప్ కొనసాగుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *