సెక్స్ లేకుండా తల్లినవుతా….. జోడీ మార్ష్

బ్రిటన్ : సెక్స్ లో పాల్గొనడం మానేసి మంచి పని చేశానని చెబుతోంది బ్రిటన్ కి చెందిన స్టార్ మోడల్ జోడీ మార్ష్ (37). బుధవారం నాడు ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన మార్ష్.. సెక్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి మంచి పని చేశానని చెప్పుకొచ్చింది. ఇక జీవితాంతం తాను సెక్స్ కు దూరంగా ఉంటానని చెప్పిన మార్ష్, ప్రస్తుతం తాను తల్లిని కావాలనుకుంటున్నట్టుగా తన కోరికను బయటపెట్టింది. అయితే తాను తల్లి అవడం కూడా సెక్స్ లో పాల్గొనడం ద్వారా కాకుండా, ఎవరైనా పురుషులు వీర్య దానానికి ముందుకొస్తే తాను గర్భం దాలుస్తానని చెప్పింది. ఇదిలా ఉంటే, గతేడాది జేమ్స్ ప్లాసిడో అనే వ్యక్తిని విహహాం చేసుకున్న మార్ష్, పెళ్లయి ఏడాది తిరగకుండానే గత ఏప్రిల్ లో భర్త నుంచి విడిపోయింది. జేమ్స్ తో వివాహానికి ముందు ఆమె ఐదేళ్లుగా బ్రహ్మచర్యం పాటిస్తూ వస్తోంది.

jodie marsh

మహిళలంటేనే సెక్స్ డాల్స్ గా భావించే పురుషులున్న సమాజంలో బ్రహ్మచర్యం ద్వారా సన్యాసినిగా ఉండడం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచినట్టుగా తెలిపింది మార్ష్. బ్రహ్మచర్యం తీసుకున్నాకే తనపై తనకు గౌరవం కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది. తనను తాను ఓ సన్యాసినిగా గుర్తించుకున్నట్టు తెలిపిన జోడీ మార్ష్.. జీవితంలో సరైన వ్యక్తిని ఎంచుకునే విషయంలో ప్రపంచంలోనే తనంత దురదృష్టవంతురాలిగా అభివర్ణించుకుంది. ప్రేమలో ఉన్నప్పుడే తనకు ప్రేమకు గుడ్డిదన్న విషయం అర్థమైనట్టుగా వ్యక్తపరిచింది. త్వరలోనే వీర్యదాత ద్వారా గర్భం దాల్చేందుకు అమెరికా వెళ్తున్నట్టు పేర్కొంది. ఇకపోతే జేమ్స్ తో పెళ్లవడానికి ముందు కూడా తాను వీర్యదాత కోసం వెతికినట్టు చెప్పిన మార్ష్, అందుకోసం డెన్మార్క్ వెళ్లడానికి సిద్దపడినట్టు, డెన్మార్క్ లో అయితే ఎవరికీ తెలిసి అవకాశం ఉండడంతో అక్కడికి వెళ్లడానికి సిద్దపడినట్టు చెప్పుకొచ్చింది. అయితే తనకు తెలిసిన ఓ డాక్టర్ వద్దని వారించడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడిందని దీంతో ఇప్పుడు అదే పని మీద అమెరికా వెళ్లబోతున్నానని ప్రకటించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *