భారత్‌కు రానున్న యాక్షన్‌ స్టార్‌ జాకీచాన్‌

దుబాయ్‌: యాక్షన్‌ స్టార్‌ జాకీచాన్‌ త్వరలో భారత్‌కు రానున్నాడు. కుంగ్‌ఫూ యోగా చిత్రీకరణ కోసం చాన్‌ భారత్‌కు రానున్నట్లు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ తెలిపారు. ఈ చిత్రంలో సోనూసూద్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్చి 21న జాకీచాన్‌ జైపూర్‌కు చేరుకోకున్నట్లు సోనూ తెలిపారు.

jackie chan

15 రోజుల పాటు ఇక్కడ షూటింగ్‌ చేస్తామని.. ఆ తర్వాత బీజింగ్‌లో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నాడు. జాకీచాన్‌ లాంటి గొప్ప నటుడి పక్కన నటించే అవకాశం రావడం గర్వంగా ఉందని సోనూసూద్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన పక్కన నటించాలనదే ప్రతి నటుడి కల అని జాకీచాన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. చాన్‌ సహా బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌, అమీరా దస్తూర్‌ నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 Comments

  1. www April 3, 2016 Reply
  2. Anna April 15, 2016 Reply

Add a Comment

Your email address will not be published. Required fields are marked *