పృథ్వీ-2 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. యూజర్ ట్రయల్స్‌లో భాగంగా అణు సామర్థ్యమున్న ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి రక్షణశాఖ ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను చేధించగల ఈ మిసైల్‌ను బుధవారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోని లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి మొబైల్ లాంచర్ ద్వారా పరీక్షించినట్టు రక్షణవర్గాలు వెల్లడించాయి. తాము నిర్వహించిన తొలి పరీక్ష విజయవంతమైందని, సాంకేతిక సమస్యల కారణంగా రెండో పరీక్షను నిలిపివేశామని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి జంట పరీక్షలను ఇదే ప్రయోగ వేదిక నుంచి 2009 అక్టోబర్ 12న నిర్వహించింది. 350 కిలోమీటర్ల లక్ష్యంగా రెండు లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్ల సహాయంతో 500 కేజీల నుంచి 1000 కేజీల బరువు ఉండే వార్‌హెడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం పృథ్వీ-2కు ఉంది.

solar eclipse

 

గతిమార్గంలో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని ఛేదించడానికి అత్యాధునిక ఇనెర్టియల్ గైడెన్స్ సిస్టంను ఈ క్షిపణి ఉపయోగించుకొన్నది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కు చెందిన శాస్త్రవేత్తలు స్ట్రాటెజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ)గా ఏర్పడి ఈ పరీక్షలను నిర్వహించారు. ఒడిశా తీరంలోని ఏర్పాటు చేసిన టెలిమెట్రీ స్టేషన్ల నుంచి డీఆర్డీవో రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా ఈ మిసైల్ గతిమార్గాన్ని పర్యవేక్షించారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం (ఐజీఎండీపీ) కింద డీఆర్డీవో నిర్మించిన మొట్టమొదటి క్షిపణి పృథ్వీ-2 అని రక్షణశాఖ అధికారులు తెలిపారు. తొమ్మిది మీటర్ల పొడవు, సింగిల్ స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్డ్ పృథ్వీ-2 మిసైల్‌ను భారత రక్షణ దళంలోకి 2003లో ప్రవేశపెట్టారు. పృథ్వీ-2 యూజర్ ట్రయల్‌ను చివరిసారిగా 2016 ఫిబ్రవరి 16న నిర్వహించారు.

One Comment

  1. Williamsamy June 5, 2016 Reply

Add a Comment

Your email address will not be published. Required fields are marked *