ఇక పొట్ట లేని IPS లు మాత్రమే

‘‘శిక్షణ ముగిసింది! పోస్టింగ్‌ వచ్చింది! ఇంక పొట్ట ఎంత పెంచినా నష్టమేమీ లేదు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు వాటంతటవే వస్తాయి’’ అని అనుకునే ఐపీఎ్‌సలకు దుర్వార్త! భారీగా బరువు పెరిగి, బాన పొట్టలుపెంచే ఐపీఎ్‌సలకు ప్రమోషన్లు ఇవ్వొద్దని కేంద్రం నిర్ణయించుకుంది. హోంశాఖ సిఫారసు మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) దీనికి సంబంధించిన సర్వీస్‌ రూల్స్‌ను సవరించి.. ముసాయిదాను ఖరారు చేసింది. ఇక కేంద్రం దీనిని ఆమోదించడమే ఆలస్యం. దీంతోపాటు.. ప్రతి ఐపీఎస్‌ అధికారి ఇంటెలిజెన్స్‌, ఆర్థిక నేరాలు, సైబర్‌ నేరాలు, వీఐపీ సెక్యూరిటీ, పారిశ్రామిక భద్రత, ఉగ్రవాద నియంత్రణ, కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీ ఇలాంటి మొత్తం 20 కీలక విభాగాల్లో కనీసం మూడింటిపై పూర్తిగా పట్టు సాధించాలని ప్రతిపాదించారు. డీఐజీ, ఐజీ, అదనపు డీజీగా ప్రమోషన్‌ పొందేముందు కేంద్రం వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. మరోవైపు… ఐపీఎ్‌సలు నిర్దిష్ట రెండేళ్ల కాల వ్యవధిలో ప్రొబేషన్‌ పూర్తి చేసేలా కూడా నిబంధనలు రూపొందిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *